తమ నూతన మెనూ విడుదల చేసిన లగ్జరీ ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ వోయిలా 

Lifestyle Telangana

మనవార్తలు ,హైదరాబాద్‌ :

మోస్ట్‌ హ్యాపెనింగ్‌ నగరం హైదరాబాద్‌లో లగ్జరీ ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ వోయిలా తమ నూతన మెనూను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. సంప్రదాయ యూరోపియన్ వంట‌కాల‌కు, భారతీయత‌ను మిళితం వోయిలా నూతన మెనూను విడుదల చేసింది.ఈ రెస్టారెంట్‌లో కట్లెరీ, పెయింటింగ్స్‌, ఆర్టిక్రాఫ్ట్స్‌, ఫర్నిచర్‌, లైట్స్‌, చాండ్లియర్స్‌, డెకార్‌ సైతం కొనుగోలు చేయవచ్చు. ఒక‌వైపు ఆహారం ఆస్వాదిస్తూనే..మ‌రోవైపు షాపింగ్‌ పూర్తి చేయవచ్చు. త్వరలోనే వోయిలా ఓ కాఫీ బార్‌ను ఔట్‌డోర్‌ ఏరియాలో ప్రారంభించనుంది. ఈ నూతన మెనూలో వేడి మరియు చల్లటి – సఫ్రాన్‌ అండ్‌ పంప్కిన్‌ సూప్ ,ఫోకాసియా ఎక్లెయిర్ ,పాన్‌ టాస్డ్‌ ఉడీర్స్ ఉంటాయి.

ఈ నూతన మెనూ ఆవిష్కరణ గురించి వోయిలా యజమానులు రాజ శ్రీకర్‌, కునాల్‌ కుక్రేజా మాట్లాడుతూ ‘‘వోయిలా వద్ద మేము స్ధిరంగా నూతన ఆవిష్కరణలు చేయడంతో పాటుగా మా మెనూకు నూతన డిషెస్‌ను జోడిస్తూ మా అతిథులు, అభిమానులకు ఆసక్తిని కలిగిస్తున్నాము. మా మెనూలు ప్రతి మూడు నెలలకూ ఓ మారు మారుతుంటాయి. మా అతిథులకు అత్యుత్తమ అనుభవాలను ఎప్పుడూ అందించాలనుకుంటున్నాము. ఈ నూతన మోనూ లో సంప్రదాయ యూరోపియన్‌, ప్రాంతీయ భారతీయ వంటకాలతో పాటుగా మరెన్నో స్ధానిక డిషెస్‌కు విలాసవంతమైన రూపునందించి అందిస్తున్నాం. వోయిలా హెడ్‌ చెఫ్‌ సోంబిర్‌ ఈ అద్భుతమైన మెనూ తీర్చిదిద్దారు. ఆయన మా బృందానికి నిత్యం స్ఫూర్తి కలిగిస్తూనే నాణ్యతను నిర్వహిస్తూ ప్రమాణాలనూ ఆచరిస్తున్నార అని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *