మరో వారం రోజులపాటు లాక్‌డౌన్ పొడిగింపు…

Hyderabad

 మరో వారం రోజులపాటు లాక్‌డౌన్ పొడిగింపు?

హైదరాబాద్:

రాష్ట్రంలో సత్ఫలితాలనిస్తున్న లాక్‌డౌన్ మంత్రి మండలిలో చర్చించిన అనంతరం నిర్ణయం 30న కేసీఆర్అధ్యక్షతన  మంత్రి మండలి సమావేశం పలు అంశాలపై చర్చ కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ వల్ల కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని యోచిస్తోంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ నెల 30తో లాక్‌డౌన్ ముగియనుంది. లాక్‌డౌన్ సత్ఫలితాలనే ఇచ్చిందని, మరికొన్ని రోజులు పొడిగిస్తే కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికితోడు రాష్ట్రంలో ఇప్పుడు రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. కాబట్టి అమల్లో ఉన్న ఆంక్షలను కొంతమేర సడలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, 30న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ విషయాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, బ్లాక్ ఫంగస్‌కు చికిత్స, ఔషధాలు, రెండోదశ టీకాలు, కొవిడ్ పరీక్షల పెంపు, ఆక్సిజన్ ఉత్పత్తి, సేకరణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వానాకాలం పంటల ప్రణాళిక తదితర అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *