మనవార్తలు ,పటాన్ చెరు :
బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు బ్రిడ్జి నిర్మాణానికి రూ.96 కోట్ల 51 లక్షలతో 1.65 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు కేటాయించడం చాలా సంతోషకరమని పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కొత్త కాలనీలు ఏర్పడటంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని . ఈ మూడు ఫ్లైఓవర్ నిర్మాణలు జరిగితే నియోజకవర్గ ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోతాయని అదేవిధంగా మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు మెట్రో రైలు పొడిగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి వినతిపత్రం ఇచ్చారు శుక్రవారం ఒక్క రోజే కేంద్ర ప్రభుత్వం నిధులతో 8 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు .లింగంపల్లి వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించిన కేంద్రమంత్రికి కృతజతలు తెలిపారు .
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇన్ని నిధులు కేటాయిస్తుంటే కేటీఆర్ ఇక్కడా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మాత్రం నిధులు ఇవ్వటంలేదు అనడం చాలా విడ్డురంగా ఉందని అన్నారు .రాష్ట్రంలో దేశానికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కేటీఆర్ ఇష్ట మొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని నందీఈశ్వర్ గౌడ్ అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతి అభివృద్ధి పనుల్లో దోచుకోవడమే లక్షంగా పెట్టుకున్నారని ఆఖరికి దేవుడ్ని కూడా వదలి పెట్టట్లేదని విమర్శించారు. పట్టణంలోని రామమందిరం భూములను ఒక నెలలోపు ఎమ్మెల్యే తిరిగి ఇవ్వాలని.లేని పక్షంలో ఒక నెల తర్వాత ఎమ్మెల్యే ఇంటిముందు వెళ్లి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఐనోల్ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని భూములపై గ్రామస్థులు ప్రశ్నిస్తే నాకు ఎలాంటి సంబంధం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా తనపై ఆరోపణలు చెయ్యడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఐనోల్ గ్రామానికి 120 ఇందిరమ్మ ఇళ్లను కట్టించమని గుర్తు చేశారు. ఎమ్మెల్యే హయాంలో ఐనోల్ గ్రామానికి ఏమి అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇద్దరం కలిసి గ్రామానికి వెళ్లి గ్రామస్తుల సమక్షంలోనే అభివృద్ధి పైన చర్చిద్దామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలోబీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా ,బీజేపీ పటాన్చెరు పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.