పటాన్చెరు
టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఆటోవాలాలకు అండగా నిలిచారు. పటాన్చెరు పట్టణానికి చెందిన 49 మంది ఆటోడ్రైవర్లకు లక్షా 75 వేల రూపాయలు సొంత ఖర్చుతో డ్రైవింగ్ లైసెన్స్ లు అందజేశారు. ఈ సందర్భంగా గూడెం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ఆటోలు నడిపి ప్రయాణికుల మనసును గెలుచుకోవాలని అన్నారు. ఆటోలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ,వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్స్ మాట్లాడకూడదని అలాగే ప్రయాణికులను సురక్షింతకంగా వారి గమ్యస్థానానికి చేర్చాలని ఆటో డ్రైవర్లకు సూచించారు . ఈ సందర్బంగా గూడెం మధుసూదన్ రెడ్డి కి ఆటో డ్రైవర్లకు అందరు కృతజ్ఞతలు తెలిపారు