పటాన్ చెరు:
మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు, ఎండిఆర్ పౌండేషన్ వ్యవస్థాపకులు దేవేందర్ రాజు పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని పటాన్ చెరు పట్టణంలో నూతన మార్కెట్ సమీపంలో గురువారం మట్టి వినాయకులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెమికల్ రంగులతో తయారుచేసిన వినాయకుల వల్ల నీరు కలుషితం అవుతుందన్నారు.
ఇది పర్యావరణానికి కూడా ప్రమాదం అన్నారు. పర్యావరణ సమతుల్యత ఉంటేనే అన్ని రకాల జీవుల మనుగడ కొనసాగుతోందన్నారు. నేడు యాంత్రిక ప్రపంచంలో ఇప్పటికే కాలుష్యం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి తరుణంలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కరోనా ప్రభావిత సమయం కాబట్టి వినాయక మండపాల వద్ద ఎక్కువమంది గుమి కూడవద్దని అన్నారు.
కరోనా జాగ్రత్తలతో ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండిఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మధు, మాజీ వార్డు మెంబర్ అనంతయ్య, పోచారం కృష్ణ, ఎండిఆర్ యువసేన సభ్యులు ప్రవీణ్, ప్రణీత్, చోటు, శ్రీకాంత్, నర్సింగ్, వేణు, వినయ్, జాన్సన్, రాజశేఖర్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.