శేరిలింగంపల్లి :
ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహలను పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాడాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. గురువారం రోజు కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొన్ని కాలనీలు, బస్తీలలో జీహెచ్ఎంసి సహకారంతో జరిగిన ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణి కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిధిగా హాజరై మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి, పర్యావరణ రక్షణలో భాగస్వామ్యులు కావాలని కోరారు.
వివిధ కెమికల్స్, రసయనాలు కలిగిన, రంగులను కలిగిన గణపతులను కాకుండా స్వచ్ఛమైన మట్టి గణపతులను పూజించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిర్మల, రూప రెడ్డి, మధు ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, ఎల్లయ్య, డా రమేష్, గిరి గౌడ్, యాదగిరి, ప్రభాకర్, మంగలి కృష్ణ, సత్యం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లావణ్య, రాజా సింగ్, శ్యామల, జహంగీర్, దీపక్, ఎసార్పి రాజయ్య, యస్ ఎఫ్ ఏ వేణు తదితరులు పాల్గొన్నారు.