పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
మట్టి వినాయకులను పూజించి పర్యావరణంను పరిరక్షిద్దామని బిఆర్ఎస్ నాయకులు ఎండి అభిద్ అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మండలంలోని ముత్తంగి సాయి ప్రియ కాలనీలో వెయ్యి వినాయక ప్రతిమలను కాలనీవాసులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అభిద్ మాట్లాడుతు పర్యావరణాన్ని పరిరక్షించాలని ఉద్దేశంతో నా వంతుగా ప్రతి ఏటా కాలనీవాసులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దీనితోపాటు ప్రతి ఏటా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల కనుగుణంగా సర్వ మతాల పండుగలను సోదరా భావంతో చేసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుందన్నారు. పాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాల వల్ల పర్యావరణం విషతుల్యంగా మారి జీవన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడే విధంగా సామాజిక బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మెరాజ్ ఖాన్, పుణ్యవతి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.