బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :
ఆదర్శమూర్తి మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలని బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి గారు పిలుపునిచ్చారు. బుధవారం మహాత్మా గాంధీ గారి 155’వ జయంతి వేడుకల సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని బీ.సీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్ముడి విగ్రహానికి కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి స్థానికులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అహింసా మార్గంలో నడుస్తూ శాంతి స్థాపనకు కృషి చేయాలని కోరారు. అదే మహాత్ముడికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. దేశం గురించి గాంధీజీ కన్న కలల సాకారం కోసం మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి , వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి , కౌన్సిలర్లు గోపాలమ్మ , చంద్రయ్య , నర్సింహా రాజు , స్థానిక నాయకులు సంపత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి , రాష్ట్ర కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి , వెంకటయ్య, రమేష్ రెడ్డి , రాజ్ గోపాల్, యువజన నాయకులు బషీర్ , కాలనీ వాసులు విశ్వనాధ్ , శ్రీనివాస్ , బీరప్ప భాను , స్వామి , విజయ్ , వెంకటేష్ , తదితరులు పాల్గొన్నారు.
