politics

కలసికట్టుగా సమస్యలు పరిష్కరించుకుందాం … చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు:

అందరం కలిసికట్టుగా గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు .శనివారం చిట్కుల్ గ్రామాల్లో వార్డు 2,3,5 ల లో సీసీ రోడ్లు కు, గ్రామ ఉప్ప సర్పంచ్,ఎంపీటీసీ నరేందర్ రెడ్డి ,నారాయణ రెడ్డి వార్డు సభ్యుల తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులతో సిసి రోడ్లు లకు శంకుస్థాపన , గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పరిష్కరించే విధంగా కృషి చేస్తాను అని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి గత ప్రభుత్వాల హయాంలో ఏ గ్రామానికి అభివృద్ధ్ద జరగలేదని ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పారదర్శకంగా పరిపాలన అందిస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు పోతున్నారని తెలిపారు .

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసినప్పుడే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందుతామని సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాజీ ఎంపీపీ శ్రీశైలం ,మాజీ సర్పంచ్ రవీందర్, దుర్గయ్య, వెంకటేష్, కృష్ణ, శ్రీశైలం, రాజ కుమార్, నర్సింగ్ యాదవ్, తలారి ఆంజనేయులు,వెంకటేష్ భుజంగం. శ్రీను. మురళి. టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్,ఎన్ ఎన్ ఎం యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

3 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

3 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago