మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
బిఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగుడా లో ఆదివారం గోడకు వాల్ పోస్టర్ అంటిస్తూ కార్యకర్తలందరు సభను విజయవంతం చేయాలని అలాగే బిఆర్ఎస్ పార్టీ చేసిన మంచి పనుల గురించి ప్రజలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు.