పండగ సాయన్న స్పూర్తి తో ముందుకు వెళ్దాం_నీలం మధు ముదిరాజ్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పండగ సాయన్న స్ఫూర్తితో ముదిరాజులంతా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ముదిరాజుల ఐక్యత, రాజకీయ ఎదుగుదల కోసం కృషి చేస్తున్న నీలం మధు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని మహబూబాబాద్ జిల్లాలోని పాలకుర్తి,డోర్నకల్,మహబూబాబాద్ అసెంబ్లీ నియోజికవర్గాల ముదిరాజ్ సంఘం నాయకులు ప్రజా ప్రతినిధులు నీలం మదుకు విజ్ఞప్తి చేశారు. వచ్చేనెల 21న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పండగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం తో పాటు ఎన్టీఆర్ స్టేడియంలో 25 వేల మందితో ముదిరాజ్ సింహ గర్జన సభ ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నీలం మధును మహబూబాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగ సాయన్న స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నీలం మధు ముందుండి నడిపించడంతో పాటు ముదిరాజుల రాజకీయ ఐక్యత మరియు రాజకీయ అవకాశాల కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పండగ సాయన్న జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మొదలైన పండగ సాయన్న విగ్రహా ఏర్పాటుకు కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నీలం దుర్గేష్ ముదిరాజ్,జిల్లా అధ్యక్షులు చిల్లా సహదేవ్,కాటా భాస్కర్, రంజిత్,కరుణాకర్,కొత్తూరు రమేష్,అలువాల సోమయ్య,పిట్టల ధనుంజయ్,ఎదరబోయిన సూరయ్య,దుండి వెంకటేశ్వర్లు,గుండా వెంకన్న ,మల్లం యాకయ్య,సాదు రాములు,శీలం సత్యనారాయణ,గడ్డం ఉప్పలయ్య,అలువాల శ్రీకాంత్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *