మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండ లో బీజేపీ సీనియర్ నాయకులు మొవ్వా సత్యనారాయణ, రవికుమార్ యాదవ్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ల ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషికి చిహ్నంగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా సేవాలాల్ మహారాజ్ గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉందని రాబోయే రోజుల్లో కాషాయ జెండా ఎగర వేయడం తధ్యమని తెలియజేస్తూ, నేటి తెలంగాణ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు భూ కబ్జాలకు పాల్పడుతూ ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.నాయకులు ,కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని సూచించారు.మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ మనమంతా గ్ర ఒకటే గ్రూప్ గా ఉంటూ ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని తెలిపారు.
అదేవిధంగా కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నడిగడ్డ తాండ బిజెపి అడ్డా మనమంతా బేధాభిప్రాయాలు పక్కన పెట్టి ఎలాంటి భేషజాలకు పోకుండా ముందుకు పోతూ ప్రతి ఒక్కరు పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, రాఘవేంద్రరావు, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, వినయ్, త్రినాథ్, మదనాచారి, జంగయ్య యాదవ్ , హరికృష్ణ, లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీశైలం కురుమ, గణేష్ ముదిరాజ్, హరిప్రియ, స్వప్న రెడ్డి, వినోద్ యాదవ్ , ఆంజనేయులు, చందు, మధు యాదవ్ , శివరాజ్, శ్రీను జె, రాము, రాజ్, జైశ్వాల్ తదితరులు పాల్గొన్నారు.