_పూలే కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్తని, ఆయన యొక్క ఆలోచనలు, ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి పురస్కరించుకుని పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలే చిత్ర పటానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగు వర్గాల వారిని చైతన్య పరచడంలో పాటు వెనుకబడిన వర్గాల బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను ప్రోత్సహించిన మహోన్నత వ్యక్తి పూలే అని కొనియాడారు. మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అఫ్జల్, దళిత సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…