ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేసిన తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి

Districts Hyderabad politics Telangana

సంగారెడ్డి:

డా” సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిజిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగిన “ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ ప్రదానోత్సవ “కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.జిల్లాలోని వివిధ గ్రామాల్లో, మండలాల్లో,పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత కలిగిన బోధనలను అందిస్తూ, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానోత్సవం చేశారు.

అనంతరం తెలంగాణ శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ వి.భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ” సంగారెడ్డి జిల్లా పరిధిలో పని చేస్తున్నప్రధానోపాధ్యాయులకు,ఉపాధ్యాయులకు గురుపూజోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.అమ్మ మనకు జన్మను ఇస్తే గురువులు జీవితాన్ని ప్రసాధిస్తారని ఆయన చెప్పారు.ఎంత పెద్ద స్థాయికి ఎదిగిన గురువులకు మాత్రం శిస్యులమనే విషయం గుర్తుకుపెట్టుకోవాలన్నారు.ఈ ప్రపంచంలో ఎవరికి ఏ ధానం చేసిన కొన్ని రోజుల తరువాత మర్చిపోతారని కానీ విద్యను దానం చేస్తే మాత్రం చనిపోయే వరకు గుర్తు పెట్టుకొంటారని భూపాల్ రెడ్డి అన్నారు.ఆయన ఈ రోజు ఎమ్మెల్సీగా ,శాసన మండలి ప్రొటెం చైర్మన్ గా ఉన్నారంటే ఒకప్పుడు ఆయన గురువులు నేర్పిన అక్షర అభ్యసమే కారణమన్నారు.

తన రాజకీయ జీవితం మొదటగా విద్య కమిటీ ఛైర్మన్ తోనే మొదలు అయ్యిందని అలా అంచెలు,అంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఉన్నత స్థాయికి వచ్చానని ఆయన వివరించారు. తన స్వగ్రామం అయిన రామచంద్ర పురం విద్యార్థులకు నాణ్యత కలిగిన విద్యను అందించాలనే ముఖ్య లక్ష్యంతో తన స్వంత ఖర్చుతో 20 తరగతులు గదులు కలిగిన కళాశాలను కట్టించి, ప్రభుత్వానికి అప్పగించాలని ఆయన చెప్పారు.ఆ కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్ లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి తన భార్య అయిన గీత రెడ్డి గారిని మ్యాథ్స్ లెక్చరర్ గా ,జీతం లేకుండ పని చేసిందని భూపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్య వ్యవస్థ ఎంతో మెరుగుపడిందని ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలలను ,కళాశాలలను ప్రైవేట్ విద్య వ్యవస్థల కన్నా అద్భుతంగా అభివృద్ధి చేసారని ప్రొటెం చైర్మన్ చెప్పారు.కరోన కారణంగా కొంత ఇబ్బందులు ఉన్న సమస్యలను అధిగమించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని చెప్పారు.ఉపాధ్యాయులు తమ వృత్తిని సక్రమంగా నిర్వర్తిస్తేనే విద్యార్థులు బాధ్యత కలిగిన పౌరులుగా ఎదుగుతారని ఆయన అన్నారు.

తెలంగాణలో ఉన్న విద్యార్థి లోకం,ఉపాధ్యాయులు అందరూ సర్కార్ కి బాసటగా నిలవాలని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి. భూపాల్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ లు వీరా రెడ్డి, రాజశ్రీ షా,జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేష్, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్ ,మండల విద్యాశాఖాధికారులు,ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *