-గీతం అధ్యాపక వికాస కార్యక్రమ ప్రారంభోత్సవంలో వక్తలు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అవి, బోధనా నెపుణ్యాలను పెంపొందించడానికి, విద్య నాణ్యత మెరుగుపరచడానికి అధ్యాపకులకు నిరంతర శిక్షణ అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (జీఎస్ పీ ) ఆధ్వర్యంలో ‘శక్షకులకు శిక్షణ’ పేరిట శనివారం ఒకరోజు ఆధ్యానిక నికాన కార్యక్రమాన్ని నిర్వహించారు.అధ్యాపకులను వర్తమాన అవసరాలకు అనుగుణంగా తీర్చదిద్దడానికి, వారి నేపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించడం -లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆర్ఎక్స్ సెల్లా వ్యవస్థాపకుడు, డెరైక్టర్, గతంలో డాక్టర్ రెడ్డీస్ లో శిక్షకుడిగా పనిచేసిన బెదద్యుతి చక్రవర్తి ప్రధాన వక్తగా పాల్గొన్నారు . ఈ ఎఫ్ డీపీలో పాల్గొన్న వారికి ప్రాజెక్టు-ఆధారిత అభ్యానం, పరిశోధన- నమ్మగ బోధన, విద్యార్థి-కేంద్రీకృడు అభ్యాసాలను చక్రవర్తి పరిచయం చేశారు.


సాంకేతికత – ఆధారిత అభ్యాస పద్ధతులను నేర్చుకోవడంలో సహాయ పడటానికి, విద్యార్థుల పురోగతి, అభ్యాసానికి సంబంధించిన నిర్మాణాత్మక, సంగ్రహణ అంచనాలను అభివృద్ధి చేయడానికి ఈ శిక్షణ సహాయపడుతుందన్నారు.తొలుత, ఈ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ ప్రారంభించి, అతిథిని జ్ఞాపికతో సత్కరించారు. ఆ తరువాత ఎఫ్ డీపీ వినూత్నంగా డిజిటల్ విధానంలో ప్రారంభించారు. మారుతున్న అనసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, బోధనా పద్ధతులు, మూల్యాంకన వ్యూహాలకు అనుగుణంగా సాఠ్యాంశాల బోధన ఉండాలని డాక్టర్ శివకుమార్ అభిప్రాయపడ్డారు. జంట నగరాల చుట్టుపక్కల ఉన్న పలు ఫార్మసీ కళాశాలల నుంచి దాదాపు 40 మందికి పెగ్డా అధ్యాపకులు ఈ అధ్యాపక వికాస కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ ముగింపు సదస్సులో ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. జీఎస్ పీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బొప్పాదిత్య ఛటర్జీ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడంతో పాటు వందన సమర్పణ కూడా చేశారు.

గీతమ్ ను సందర్శించిన సాయి మేధా ఇన్ స్టిట్యూట్ విద్యార్థులు
హైదరాబాద్, కోఠిలోని సాయి మేధా ఇన్ స్టిట్యూట్ కు చెందిన దాదాపు 800 మంది డిప్లొమా విద్యార్థులు శనివారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శిచడంతో పాటు గీతం ప్రవేశ పరీక్షను కూడా రాశారు.ఈ విద్యార్థులందరితో గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి ముఖాముఖి నిర్వహించారు.గీతమ్ లోని మౌలిక సదుపాయాలు, నిర్వహిస్తున్న కోర్సులు, ప్రయోగశాలలు, కెరీర్ గైడెన్స్ ఆవకాశాలు, వ్యవస్థాపకులుగా విద్యార్థులు ఎదగడానికి తోడ్పడే వెంచర్ డెవలప్ మెంట్ కేంద్రం, విద్యార్థుల సంపూర్ణ పరిణితికి ఉపకరించే విద్యార్థి క్లబ్లు, హాస్టళ్ల వసతి, రవాణా సదుపాయాలు వంటి వివరాలను ఆయన విద్యార్థులకు తెలియజేశారు. వారి సందేహాలను నివృత్తి చేశారు.ఆ తరువాత గీతమ్ లోని వివిధ ఇంజనీరింగ్ విభాగాధిపతులు ఆయా విభాగాల వారీగా (ఈసీఈ, మెకానికల్, సివిల్, సీఎస్ ) విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. గీతమ్ లోని వసతులను స్వయంగా వీక్షించేలా క్యాంపస్ టూర్ ను ఏర్పాటు చేశారు. విజయవంతంగా ముగిసిన ఈ కార్యక్రమాన్ని గీతం అడ్మిషన్ల విభాగం సమన్వయం చేసింది.
