నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ ‘

politics Telangana

-గీతం బీ – స్కూల్లో విజయవంతంగా ముగిసిన యాజమాన్య వికాస కార్యక్రమం

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని , తుది శ్వాస వరకు అందివస్తున్న ఆధునిక పరిజ్ఞానం , మెళకువలను ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూనే ఉండాలని వక్తలు సూచించారు . గీతం బిజినెస్ స్కూల్ , హైదరాబాద్ లోని ఆగస్టు 2-3 తేదీలలో ‘ సమర్థ పనితీరు ‘ ( “ Performance Excellence ” ) అనే అంశంపై రెండు రోజుల యాజమాన్య వికాస కార్యక్రమాన్ని ( ఎండీపీ ) నిర్వహించారు . ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం హెటిరో ఉన్నతస్థాయి మేనేజర్ల కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమ ముగింపు ఉత్సవం బుధవారం జరిగింది . సిబ్బంది పనితీరు నెపుణ్యం , సంస్థ లక్ష్యాలను సాధించడంలో వారి పాత్ర వంటి ముఖ్యమైన అంశాలపై ఈ ఎంపీడీలో దృష్టి సారించారు . ఇందులో పాల్గొన్న 14 మంది మేనేజర్లు కార్యక్రమ నిర్వహణ , వసతి , ఇతరత్రా ఏర్పాట్లతో పాటు ముఖ్యంగా అద్భుతమైన శిక్షణ పొందిన నెపుణ్యాల గురించి బహుదా ప్రశంసించారు . గీతం బీ – స్కూల్ అధ్యాపకులు డాక్టర్ దివ్య కీర్తి గుప్తా , ప్రొఫెసర్ కృష్ణమోహన్లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడంతో పాటు , అతిథుల ప్రశంసలను కూడా అందుకున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *