అభివృద్ది పనులకు శంకుస్థాపన…

Hyderabad Telangana

అభివృద్ధి పథంలో పటాన్ చెరు…

– మేయర్ గద్వాల విజయలక్ష్మి

రామచంద్రపురం:

సమిష్టి సహకారంతో పటాన్ చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

బుధవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలో ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శాసన మండలి ప్రోటేమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి, బల్డియా మేయర్ గద్వాల విజయలక్ష్మి లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. పటాన్ చెెరు నియోజకవర్గం పరిధిలోని మూడు జిహెచ్ఎంసి డివిజన్లలో టిఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉంచి ఘన విజయాన్ని అందించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమిష్టి కృషితోనే ఏదైనా సాధించవచ్చని తెలిపారు.ప్రతి డివిజన్ పరిధిలో థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి,
మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి ఉన్నత అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *