గీతం ఏరో క్లబ్ ప్రారంభం

Telangana

– లాంఛనంగా ప్రారంభించిన సెర్రూట్ ఏరోస్పేస్ డెరెక్టర్ డాక్టర్ సీవీఎస్ కిరణ్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో గీతం ఏదో క్లబ్ (జీఏసీ) గురువారంస్మెరూట్ ఏరోస్పేస్ డెనైక్టర్ (సరిశోధన- అభివృద్ధి, వ్యూహాల) డాక్టర్ సి.వెంకట సాయికిరణ్ ప్రారంభించారు. ఏరోస్పేస్ సంబంధిత రంగాలలో విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు వారి వ్యక్తిగత అభివృద్ధి కోసం నిలువెన అవకాశాలను అందించడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. ఏరోస్పేస్పి లోతైన అవగాహనను పెంపొందించడం, అనుభవాలను అందించడం, వివిధ రంగాలలో విద్యార్థుల వృద్ధిని ప్రోత్సహించాలని సంకల్పించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సీవీఎస్ కిరణ్ తన ప్రసంగంలో విశ్వసనీయత ప్రాముఖ్యత, ఏరోస్పేస్ రంగంలో స్థిరమైన ఆవిష్కరణల అవసరాన్ని నొక్కిచెప్పారు. పాఠ్య పుస్తక జ్ఞానాన్ని నిజ జీవిత దృశ్యాలకు వర్తింపజేయాలని, ఇంజనీరింగ్ లోని వివిధ శాఖల విద్యార్థులతో బలమైన నెట్వర్లను అభివృద్ధి చేయడుంటూ విద్యార్థులను ఆయన ప్రోత్సహించారు. పరిశ్రమలో విజయాన్ని సాధించడంలో బట్టుకృషి, నాయకత్వ లక్షణాలు, పారదర్శకతల ప్రాముఖ్యతను వివరించారు. ప్రైమ్ (శాస్త్ర, సాంకేతిక, ఆంగ్ల, వెస్టు) విద్యను ప్రోత్సహించాలని, ఆ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలని కోరారు. ఎందుకంటే పంచుకోవడం ద్వారా నిజమైన అభ్యాసం జరుగుతుందని డాక్టర్ కిరణ్ అభిప్రాయపడ్డారు.

టెక్నాలజీ డెరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి మాట్లాడుతూ, గీతం నీదో క్లబ్ భవిష్యత్తు, దేశాభివృద్ధి దోహదపడే దాని సామర్థ్యం పట్ల ఆశాభావం వ్యక్తపరిచారు. ఆ క్లబ్ కు అవసరమైన సహాయ సహకారాలన్నింటినీ అందజేస్తామని హామీ ఇవ్వడమే గాక, స్వరూట్ ఏరోస్పేస్లో మరింత సహకారాన్ని పెంపొందించుకుంటానున్నారు.నీదో క్లబ్ కార్యవర్గంతో పాటు వివిధ బృందాల సభ్యులు, అధ్యాపక సమన్వయకర్తల వివరాలను స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెర్ ఎన్.సీతారామయ్య, ఏరోస్పేస్ విభాగాధిపతి డాక్టర్ వి.హిరుబిందు ప్రకటించి, వారికిబ్యాడ్జీలను అందజేశారు.

అధ్యాపక సమన్వయకర్తలలో ఒకరైన ఎస్. కిషోర్ కుమార్ అతిథులను స్వాగతించగా, మరో సమన్వయకర్త ప్రవీణ్ కుమార్ వందన సమర్పణ చేశారు.గీతం నీరో క్లబ్ వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి, సమగ్ర సరిష్కారాలను అభివృద్ధి చేయడానికి విద్యార్థులకు ఒక వేదికగా తోడ్పడడమే గాక, వినూత్న ప్రాజెక్టులను అమలు చేయడానికి, విలక్షణ ఆలోచనలను ప్రోత్సహిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *