సంస్కృతితో ముడిపడిందే భాష: డాక్టర్ కీర్తన

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మన సంస్కృతితో భాషకు దగ్గర అనుబంధం ఉందని, సాంస్కృతిక సహనం కూడా భాషతో ముడిపడి ఉంటుందని ఇంటి హెదరాబాద్లోని జాతీయ పోస్ట్ డాక్టరల్ ఫెలో డాక్టర్ వి.కీర్తన కపిలే అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లోని మనస్తత్వశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘పరాన్నజీవి: భాష, జ్ఞానం’ అనే అంశంపై ఆమె బుధవారం అతిథ్య ఉపన్యాసం చేశారు.మనం మాట్లాడదలచుకున్నప్పుడు, ముందుగా, నిరుటివారి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలని, వారుపరధ్యానంగా ఉండకుండా చూసుకోవాలని, వారితో స్పష్టమైన సాన్నిహిత్యం కలిగి ఉండాలని, సూటిగా మాట్లాడాలని,ఆమె సూచించారు.

అప్పుడు మనం చెప్పేది ఎదుటి వారు అర్థం చేసుకుని ప్రతిస్పందిస్తారని, మన చర్యకు ప్రతిచర్యఉంటుందన్నారు.ఇలా చేయడం వల్ల మనం చెబుతోంది వినేవారికి ఒకరకమైన మానసిక అవగాహన ఏర్పడుతుందని, ఆ తరువాత దానిఫలితాలు సహజంగానే వస్తాయన్నారు.మాతృ భాష అనేది సహజసిద్ధంగానే అలవడుతుందని, ద్వితీయ లేదా సర భాషను నేర్చుకోవడానికి: సామాజిక జ్ఞానాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని డాక్టర్ కీర్తన స్పష్టీకరించారు. పరుష వచనాలు లేదా దుర్భాషలను మాతృ భాషలో మాట్లాడినంత సులువుగా పర భాషలో మాట్లాడలేనున్నారు. ఈ సందర్భంగా మనస్తత్వశాస్త్ర విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సందర్భోచిత జవాబులిచ్చి ఆకట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *