Telangana

మెరుగైన విద్యను ప్రతి ఒక్కరికీ చేరువ సినినటి లక్ష్మీమంచు

లక్ష్మీ మంచు యొక్క టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ

షోస్టాపర్‌గా షో కు నూతనోత్సాహం తీసుకువచ్చిన రియా చక్రవర్తి

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

ఒక మహోన్నత కార్యక్రమం కోసం ఫ్యాషన్ అంటూ గత కొన్నేళ్లుగా నిధుల సేకరణ కార్యక్రమం కోసం వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను ఒకేదరికి తీసుకువచ్చి లక్ష్మీ మంచు నిర్వహిస్తోన్న టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ- 2025 కార్యక్రమం నేడు జరిగింది. మెరుగైన విద్యను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే మహోన్నత లక్ష్యం తో కృషి చేస్తోన్న టీచ్ ఫర్ చేంజ్ , పేద పిల్లలకు అభ్యాస అవకాశాలను మార్చడంలో ముందంజలో ఉంది. ఈ సంవత్సరం మరింత పెద్ద ప్రభావాన్ని చూపడానికి ఇది సిద్దమైనది. తమ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ లో ఉత్సాహంగా జరిగింది. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి షోస్టాపర్‌గా రన్‌వే కు కొత్త సొబగులద్దారు.ఈ సంవత్సరం ఫ్యాషన్ షోకేస్‌లో ప్రఖ్యాత డిజైనర్ స్వాతి వెల్దండి రూపొందించిన అద్భుతమైన కలెక్షన్ ను ప్రదర్శించారు. ఆభరణం నుండి అద్భుతమైన ఆభరణాలు కూడా ఈ షో లో భాగంగా ప్రదర్శించారు. టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా , ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను పెంపొందించాలనే లక్ష్యంతో సినిమా, క్రీడలు మరియు ఫ్యాషన్ రంగాలలోని ప్రముఖ వ్యక్తులు రన్‌వే పై నడిచారు.అనంతరం నటి లక్ష్మీ మంచు మాట్లాడుతూ, “టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం ఫ్యాషన్ కార్యక్రమం కంటే ఎక్కువ ఇది విద్య ద్వారా జీవితాలను మార్చడానికి కృషి చేసే ఉద్యమం. రియా చక్రవర్తి, స్వాతి వెల్దండి, ఆభరణం తో పాటుగా పరిశ్రమ భాగస్వాములందరి నుండి లభించిన అద్భుతమైన మద్దతు పట్ల మేము చాలా సంతోషంగా వున్నాము. వారి దాతృత్వం, ఓ మహోన్నత కారణం కోసం చూపుతున్న నిబద్ధత అత్యంత అవసరమైన పిల్లలకు మెరుగైన విద్యా అవకాశాలను అందించాలనే మా లక్ష్యానికి తోడ్పడతాయి అని అన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

3 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

5 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago