మన వార్తలు, శేరిలింగంపల్లి :
ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైదరాబాదులో గన్ పార్క్ దగ్గర జరిగిన కార్యక్రమంలో, తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాలపై ముదిరాజ్ చైతన్య వేదిక “లక్ష పోస్ట్ కార్డుల” ఉద్యమానికి తెర లేపింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర నాయకులు శివ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో అతి త్వరలో జరుగబోయే ఎన్నికల్లో, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 15 ఎమ్మెల్యే టిక్కెట్లను, ఎమ్మెల్సీ, ఎంపీ స్థానాలతో పాటు నామ టికెట్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముదిరాజు ల రిజర్వేషన్ సమస్యలను పరిష్కరించాలని, అందుకోసమే ఈ లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు రాసి ముదిరాజ్ ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే దిశగా ఈ ఉద్యమం సాగుతుందని, ముదిరాజ్ మహిళ రాష్ట్ర నాయకురాలు కోట్ల పుష్పలత ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలకు, సంఘాలకు, ప్రాంతాలకు అతీతంగా పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రంలో ఉన్న ముదిరాజు లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, కురుమూర్తి, నర్సింహా, సీతా మహాలక్ష్మి, సురేష్, వేంకటేశ,మహేష్, రాకేష్, జగదీష్ , కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.