_గొప్ప దార్శనికుడు మంత్రి కేటీఆర్_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు , పటాన్ చెరు
పోరాడి సాధించుకున్న తెలంగాణను టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన గొప్ప వ్యక్తి మంత్రి కేటీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 46వ జన్మదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, తెరాస పట్టణ అధ్యక్షులు అఫ్జల్, స్థానిక ప్రజాప్రతినిధుల, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
