మన వార్తలు, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ అల్విన్ చౌరస్తాలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో నిర్వహించారు. మియాపూర్ లోని బండి రమేష్ కార్యాలయం నుండి బాణాసంచా కాల్చుకుంటూ ఊరేగింపుగా అల్విన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను నాయకులు,కార్యకర్తల, అభిమానులు మరియు ప్రజల సమక్షంలో కట్ చేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ కేటీఆర్ ఆయన ఆలోచనలు నవీనం.. ఆచరణ వినూత్నం.. అధునాతన టెక్నాలజీపై పరిజ్ఞానం అచంచలం. అభివృద్ధిలో అడుగులు విప్లవాత్మకం. తెలంగాణ గడ్డకు ప్రపంచ దిగ్గజ కంపెనీలను రప్పించడంలో ఎదురులేని చాణక్యం. ప్రజా సమస్యలను ఆకలింపు చేసుకొని పరిష్కార మార్గాలు చూపడంలో విశేష నైపుణ్యం. సేవా తర్పణంకు నిలువెత్తు నిదర్శనం అని అన్నారు.
చేపట్టిన పదవులకు సంపూర్ణ న్యాయం చెయ్యగల సామర్థ్యం. లోకల్ టు గ్లోబల్ ఏ విషయం పైన వేగంగా స్పందించే గుణం. యువత భవిష్యత్తుకు ‘తారక’మంత్రం.. నవ్యతకు నిలువుటద్దం.. మోడ్రన్ టెక్నాలజీ సారథి.. ఐటీకి వారధి మంత్రి కేటీఆర్ అని. తండ్రి కి తగ్గ తనయుడిగా నేటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకుసాగుతున్న పర్ఫెక్ట్ లీడర్. రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లికార్జున శర్మ, గంగారం సంగారెడ్డి, తెప్ప బాలరాజు ముదిరాజ్, శేఖర్ గౌడ్, నర్సింగ్ రావు, ధనుంజయ్, పి మురళీధర్, భరత్, సిల్వర్ మనీష్, సలీం బాయ్, అంజద్ అమ్ము, మునాఫ్ ఖాన్, షరీఫ్ బాయ్, సత్యారెడ్డి, రవీందర్ రావు మరియు బిఆర్ యువసేన కార్యకర్తలు తరలివచ్చారు.