మనవార్తలు , శేరిలింగంపల్లి :
కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ లో వినాయక చవితి ని పురస్కరించుకుని కె ఆర్ ఆర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్మల కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అహింస చిత్ర హీరో దగ్గుపాటి అభిరామ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులకు, మహిళలకు వివిధ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్, అబ్బుల కృష్ణ గౌడ్, రాజేష్ యాదవ్, గౌస్ మియా, తదితరులు పాల్గొన్నారు.