మనవార్తలు శేరిలింగంపల్లి :
కార్తీక మాసం సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవం లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ కి చెందిన నిర్మల కోలాటం గ్రూప్ సభ్యులు కోలాటo మాస్టర్ ప్రణవ్ గణేష్ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. తమ కోలాటo కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రoలోనే ఎంతో ప్రతీస్తాత్మకంగా నిర్వహించే కోటిదీపోత్సవం లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అంతమంది పాల్గొనే పవిత్రపైన దీపోత్సవంలో పాల్గొని తమ కళా ప్రదర్శన తో ఆకట్టుకున్నారు.