politics

తెలంగాణను దివాళ దిశగామార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది -శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు:

ప్రధాని మోడీ ఎనిమిది ఏళ్ల కాలం స్వర్ణయుగమని  అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండ‌లం క‌ర్థ‌నుర్ గ్రామంలో మండ‌ల అధ్య‌క్షుడు ఈశ్వ‌ర‌య్య ఆధ్వ‌ర్యంలో సేవా సుప‌రిపాల‌న గ‌రీబ్ క‌ళ్యాణ్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. మోడీ 8 ఏళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి బీజేపీ పేరుతో కర పత్రాలను పంపిణీ చేశారు. 80 కోట్ల అట్టడుగు వర్గాల ప్రజలకు పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా ఆహారం అందించిన ఘనత మోడీకే దక్కిందని మండ‌ల అధ్య‌క్షులుఈశ్వ‌ర‌య్య అన్నారు.

పీఎం ఆవాస్ యోజన పథకం కింద 2.3కోట్ల ఇళ్ళు మంజూరయ్యాయని తెలిపారు.ఆయుష్మాన్ భారత్ యోజన కింద 3.2 కోట్ల మందికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించామని శ్రీకాంత్ గౌడ్ అన్నారు . కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటుందన్నారు .ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాళ దిశగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు .విద్యార్థులకు , నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ జూన్ 23 నుంచి జూలై 12 వరకు మూడోవిడత పాదయాత్ర విజ‌య‌వంతం చేయాల‌న్నారు .

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

5 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

7 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago