నేషనల్ లెవెల్ షటిల్ టోర్నమెంట్‌లో ప్రథమస్థానం సాధించిన నంద్యాల శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థి కౌశిక్

Andhra Pradesh

_విద్యార్థి దశనుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి

నంద్యాల ,మనవార్తలు ప్రతినిధి :

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ,చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి అన్నారు.తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగిన నేషనల్ లెవెల్ షటిల్ టోర్నమెంట్‌లో నంద్యాల విద్యార్థి సత్తా చాటాడు. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థి కౌషిక్ నేషనల్ లెవెల్ షటిల్ టోర్నమెంట్‌లో సింగిల్ ,మక్సిడ్‌ ,డబుల్స్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించినట్లు కళాశాల డైరెక్టర్లు ముడియం చంద్రమౌళీశ్వర్ రెడ్డి, రంగారావులు తెలిపారు.విజేతగా నిల్చిన కౌశిక్‌ను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్‌ మెమోంటోతో సత్కరించి 37 వేల నగదు బహుమతి అందించాడు . శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలను ప్రొత్సహిస్తున్నామని డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి తెలిపారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థినీ ,విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు .విద్యార్థుల్లోని టాలెంట్‌ను గుర్తించి వారిని ప్రొత్సహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు క్రీడల్లో కళాశాల ప్రతిష్ఠను పెంపొందించిన కౌశిక్‌ను కళాశాల యాజమాన్యం శాలువతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ లెక్చరర్లు ,విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *