పటాన్చెరు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు వెళుతోందనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమిన్ పూర్ గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగం గౌడ్ తన సోదరుడు రాములు గౌడ్ తో కలిసి సోమవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ లింగం గౌడ్ కి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, సంక్షేమ పథకాల అమలులో పక్షపాతం లేకుండా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టిఆర్ఎస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.