Telangana

మైత్రి మైదానం లో హోరా హోరీగా ముగిసిన కాంతయ్య మెమోరియల్ ఉమెన్స్ హాకీ టోర్నమెంట్

_విజేతగా నిలిచిన చంద్ర కాంతయ్య అకాడమీ సంగారెడ్డి జట్టు

_రన్నరప్ గా నిలిచిన జింఖానా బి సికింద్రాబాద్ జట్టు

_విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు:

పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న చంద్రకాంతయ్య మెమోరియల్ ఉమెన్స్ హాకీ 5A సైడ్ టోర్నమెంట్ సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ముగిసింది. మైత్రి మైదానం ప్రారంభ రోజున మంత్రి హరీష్ రావు చేతులమీదుగా హాకీ టోర్నమెంట్ ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. వివిధ జిల్లాల నుండి 10 జట్లు టోర్నమెంట్లో పాల్గొన్నాయి. చివరి రోజైన సోమవారం సాయంత్రం చంద్రకాంత అకాడమీ సంగారెడ్డి జట్టు -జింఖానా బి సికింద్రాబాద్ జట్ల మధ్య తుది పోరు జరిగింది. హోరాహోరీగా సాగిన పోటీలో చంద్రకాంతయ్య అకాడమీ జట్టు ఘన విజయం సాధించింది.

అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి మైదానాన్ని 7 కోట్ల 25 లక్షల రూపాయలతో పూర్తిస్థాయిలో ఆధునీకరించడం తో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. స్వతహాగా క్రీడాకారుడు అయిన తాను నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే మైత్రి మైదానాన్ని ఆధునీకరించడంతో పాటు, ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 3 మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు.

 

ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులు చేయడంలో చూపించే శ్రద్ధ క్రీడలపై ఆసక్తి పెంపొందించడం పై కనబరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలపై మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం, ఏకాగ్రత లభిస్తోందని అన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు.మూడు రోజుల పాటు హాకీ టోర్నమెంట్ను దిగ్విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. అనంతరం ప్రథమ విజేతకు 15 వేల రూపాయలు, రన్నరప్ కు 10 వేల రూపాయలు, తృతీయ స్థానంలో నిలిచిన వరంగల్ చెట్టుకు ఐదు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ అందించడంతోపాటు ట్రోఫీలను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పీటీసీ లు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సిఐ లు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, విజయ్ భాస్కర్ రెడ్డి, పరమేష్ యాదవ్, షేక్ హుస్సేన్, హాకీ అసోసియేషన్ ప్రతినిధులు కృష్ణ, రఘునందన్ రెడ్డి, చంద్ర శేకర్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హన్మంత్ రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

2 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

2 weeks ago