కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేత…
మన వార్తలు రెగోడ్ :
పేదవారి పెళ్లిళ్లకు ఆర్థికంగా సహాయం చేయడానికి పెద్ద మామా లాగా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ పథకం అని సిందోల్ గ్రామ సర్పంచ్ జంగం మంజుల నాగయ్య స్వామి, ఉపసర్పంచు ఆవుటి కృష్ణ ముదిరాజ్ లు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాలనుసారం శనివారం రోజు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కలు తెనుగు లక్ష్మీ, కుమ్మరి జ్యోతమ్మ, మక్త మాలన్బి. కొనిటీ ప్రేమిలా. మేథారి సుశీల. ఇందూరు సాయమ్మ., అలిగే నింగమ్మా లకు అందజేశారు.
గ్రామాన్ని అన్ని రంగాల్లో వైద్య, విద్య, విద్యుత్, వ్యవసాయ,సాంకేతిక,రెవెన్యూ,సంక్షేమ,సాంస్కృతిక,పారిశుద్ధ్యం మరియు పచ్చదనం వంటి అన్నిరంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని గ్రామస్తులు కొనియాడారు.
సర్పంచు జంగంమంజుల నాగయ్య స్వామి గ్రామాల్లో అన్ని రకాలుగా సహాయసాహకరాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ , జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బి.బి.పటేల్, అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టి.లింగంపల్లి యం.పి.టి.సి నాగులూరి నాగమ్మ బసంతు,గ్రామ వార్డ్ మెంబర్లు ఇందూరు దేవమ్మా ,విజయ్,స్కూల్ చేర్మెన్ యూ.శేఖర్, గ్రామ రైతుకమిటి అధ్యక్షుడు జంగం నాగయ్య స్వామి, టీఆరెస్ నాయకులు బసంతు, సాలే రమేష్ ,సంగారెడ్డి ,సంజీవులు,కొనిటీ దావీదు. తదితరులు పాల్గొన్నారు.