_కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
గుమ్మడిదల, మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్రంలోని ఆడపిల్లల పెళ్లి నిరుపేద కుటుంబాలకు భారం కావద్దన్న సమున్నత లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి ద్వారా మంజూరైన ఏడు లక్షల రూపాయల విలువైన చెక్కులను సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ గంగా భవాని, తదితరులు పాల్గొన్నారు.
