పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్, రామచంద్రపురం, గుమ్మడిదల, జిన్నారం, పటాన్చెరు రెవెన్యూ మండలాల పరిధిలోని 105 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ఒక కోటి 5 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేష్, అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గుమ్మడిదల మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ప్రమోద్ గౌడ్, ఐలేష్, బండి శంకర్, వెంకటేష్, షేక్ హుస్సేన్, రంశెట్టి, శివా రెడ్డి, ఆయా మండలాల తహసిల్దార్లు, నాయకులు పాల్గొన్నారు.