రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిసిలకు న్యాయం చేయాలి – శివ ముదిరాజ్

Hyderabad politics Telangana

మనవార్తలు ,హైదరాబాద్:

కేంద్ర ప్రభుత్వం బిసిల కోసం ప్రత్యేక మంత్రత్వశాఖను ఏర్పాటు చేయాలిసోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘‘కేంద్రలో బీసీమంత్రిత్వశాఖ ఏర్పాటు, ‘‘జనాభా గణనలో కులగణన’’, చేపట్టాలనే అంశంపై జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి అధ్యక్షత వహించారు. సమన్వయ కర్తగా బీసీ ఫెడరేషన్‌కులాల సమితి అధ్యక్షుడు బెల్లాపు దుర్గారావు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు .

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ శివ ముదిరాజ్ మాట్లాడుతూ జన గణనలో కుల గణన , కేంద్రంలో ప్రత్యేక బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో 27%రిజర్వేషన్ అమలు చేయాలని, బిసి ఫెలోషిప్స్ 1000 నుండి 10వేలకు పెంచాలని, బిసిలకు sc, St,లకు మాదిరిగానే ఫిజ్ స్టక్క్షర్ మార్చాలని, దేశ వ్యాప్తంగా సావిత్రి బాయి గారి పేరుతో మహిళా డిగ్రీ,పీజీ కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు బిసిల స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం ప్రత్యేక స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు, బిసి మేధావులు, రీసెర్చ్ స్కాలర్  పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *