_గీతం పరీక్షా కేంద్రంలో 2,635 మంది విద్యార్థుల హాజరు
మనవార్తలు ,పటాన్ చెరు:
జేఈఈ మెయిన్స్ రెండో దశ పరీక్ష శనివారంతో ముగియనుందని , దీనికి 2,635 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు సంగారెడ్డి సిటీ కో – ఆర్డినేటర్ ఇ.జ్యోతిరెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . ఈనెల 25 న ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్షను రెండు పిస్టుల పద్ధతిలో ( ఉదయం 9 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు ఆమె తెలియజేశారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , రుద్రారం ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్టీఏ అబ్జర్వర్గా కె.అరవింద్ , ఫ్లయింగ్ స్క్వాడ్గా మణికంఠం , మోహన్లు వ్యవహరిస్తున్నట్టు జ్యోతిరెడ్డి పేర్కొన్నారు . విశ్రాంత సెనికుడిని ఉప పరిశీలకుడిగా , మరికొంత మందిని పరిశీలకులుగా నియమించి , పరీక్షలు సజావుగా నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు .
