మనవార్తలు ,పటాన్చెరు:
కార్మికులకు ఎలాంటి ఆపద వచ్చిన నేను ఉన్నానంటూ ,కార్మికులకు అండగా నిలుస్తా అంటూ జనకార్మిక సమితి అధ్యక్షులు జనంపల్లి కమల్ అన్నారు.పఠాన్ చేరు పాశమైలారం లో గలా క్రౌన్ గోదాం లో బీహార్ వలస కార్మికుడు రవిశంకర్ ప్రమాదానికి గురయ్యాడు. ఆసుపత్రిలో తీవ్రమైన పరిస్థితి లో ఉన్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని బాధితుడి బంధువులు , తోటికార్మికులు అధ్యక్షులు జనంపల్లి కమల్ మరియు చంద్రశేఖర్ గార్లకు సమాచారం అందించారు.ఈ విషయం తెలిసిన వెంటనే క్రౌన్ గోదాం వద్దకు చేరుకొని పరిశ్రమ యాజమాన్యం తో మాట్లాడి పూర్తిచికిత్సకు అయ్యే ఖర్చుతో పాటు 6 నెలల జీతం ఇచ్చేలా ఒప్పందం చేశారు.కార్మికులు ,కుటుంబ సభ్యులు జనకార్మిక సమితి అధ్యక్షుడు జనంపల్లి కమల్ గారికి జిల్లా ఉపాధ్యక్షుడు డి. చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.