మనవార్తలు ,పటాన్ చెరు :
పటాన్ చెరువు పట్టణంలో కన్నుల పండువగ, భక్తుల జయ జయ ధ్వనాల మధ్య శ్రీ పూరి జగన్నాథుడి రథయాత్ర సాగింది.పటాన్ చెరువు పట్టణంలోని శ్రీనగర్ కాలనీ బసవేశ్వర విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జగన్నాథుడి రథయాత్ర వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం చీపుర్లతో వీధులను శుభ్రపరిచారు.ఇస్నాపూర్ లోని జగన్నాథుడి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, హరే రామ హరే కృష్ణ భజన బృందం సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.