పటాన్‌చెరు:
హానికరమైన క్యూఆర్ కోటను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఆది హ్యాకింగ్ కు గురికావొచ్చని సెల్లర్ సెక్యూరిటీ నిపుణుడు, ధ్రువీకృత ఎథికల్ హ్యాకర్, అంతర్జాతీయ రచయిత, వక్త అరుణ్ సోని హెచ్చరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో సెబైర్ భద్రతపై అవగాహన కోసం గురువారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం, CYSEC విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తరువాత మన ఫోన్స్ లోకి ప్రమాదకరమైన మాల్వలను పంపొచ్చని, వివిధ హానికరమైన ప్రయోజనాల కోసం హ్యాకర్లు ఆ కోడ్ ని వినియోగించవచ్చని చెప్పారు.
ఫోన్ లోకి వచ్చిన మాల్‌వేర్ మన సమాచారాన్నంతా రహస్యంగా సేకరించి హ్యాకర్ కు పంపాచ్చన్నారు. యూపీఐ యాలకు అనుసంధానం చేయడానికి ఎల్లప్పుడు ప్రత్యేక బ్యాంక్ ఖాతాను నిర్వహించాలని, అయితే ఆ ఖాతాలో ఎక్కువ డబ్బును ఉంచొద్దని ఆరుణ్ సోని సూచించారు. యూపీణ యాప్ ద్వారా తప్పు లావాదేవీ జరిగితే వెంటనే సెట్టింగ్స్ లోని రెయిజ్ డిప్యూటీ అనే ప్రత్నాన్యూయాన్ని తక్షణమే వినియోగించుకోవాలన్నారు. హ్యాకింగ్, సెబర్ బెదిరింపు / సాకింగ్ వంటి వాటి గురించి అరుణ్ సోని వివరించారు.
విద్యార్ధులు లేవనెత్తిన పలు సందేహాలకు సందర్భోచిత జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. తొలుత, ఈఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి తమ విభాగం గురించి వివరించగా, వెబీనార్ నిర్వాహకుడు ఎం.నరేష్ కుమార్ అథిదిని స్వాగతించారు. గీతం మూడు ప్రాంగణాలకు చెందిన విద్యార్థులు, ఆధ్యాపకులు ఇందులో పాల్గొని సెబైర్ భద్రతపై తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు