Telangana

క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఎమ్మెల్యే దొరకడం అదృష్టం సినీ నటుడు సుమన్

ఆత్మ రక్షణకు కరాటే దోహదం

ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి

పటాన్‌చెరులో అట్టహాసంగా ముగిసిన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక 10వ జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు..

విజేతలకు సినీ నటుడు సుమన్ తో కలిసి బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ప్రస్తుత సమాజంలో స్వీయ రక్షణ కోసం విద్యార్థినిలు, మహిళలు తప్పకుండా కరాటే నేర్చుకోవాలని దీని ద్వారా మానసిక ప్రశాంతత శారీరక ధారుడ్యత లభిస్తుందని సినీ నటుడు సుమన్ అన్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని భారతరత్న పీవీ నరసింహారావు ఆడిటోరియంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సౌజన్యంతో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక పదవ జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో సుమన్ మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తి కలిగి నిరంతరం క్రీడల అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దొరకడం పటాన్‌చెరు నియోజకవర్గం ప్రజల అదృష్టమని అన్నారు. గత పది సంవత్సరాలుగా జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు సహకారం అందించడం పట్ల అభినందనలు తెలిపారు. తాను విద్యార్థి దశ నుండి మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకోవడం ప్రారంభించామని 50 సంవత్సరాలు గడిచిన ఇంకా ఆసక్తి తగ్గలేదని తెలిపారు. చదువుతోపాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ఏడాది పొడవునా వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడలకు పటాన్‌చెరు కేంద్రంగా నిలవడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకట్ రెడ్డి, వెంకటేష్, షకీల్, రామ్మోహన్, వినోద్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago