రోగ నిర్ధారణతో ఐసోటోప్లది కీలక భూమిక…

Districts politics Telangana

– గీతం కార్యశాలలో పేర్కొన్న భాభా అణు పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు

మనవార్తలు ,పటాన్‌చెరు:

రోగ నిర్ధారణలో రేడియో ఐసోటోప్లు కీలక భూమిక పోషిస్తున్నాయని భాభా అణుపరిశోధనా సంస్థ ( బార్క్ ) లోని రేడియోఫార్మాస్యూటికల్స్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మాధవ బి.మల్లియా అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్షాప్లో మంగళవారం ఆయన ‘ రేడియో ఐసోటోప్ ప్రొడక్షన్’పై ఉపన్యసించారు . కేవలం ఆరు గంటల జీవితకాలంతో టెక్నీషియం -99 ఎం , 66 గంటలు మనగల మాలిబ్దినం -99 వంటి రేడియో ఐసోటోప్లు రోగ నిర్ధారణలో చాలా ముఖ్యమైనవన్నారు . న్యూక్లియర్ మెడిసిన్లో ‘ వర్క్ హార్స్’గా పిలువబడే టెక్నాషియం -99 ఎంను వినియోగించి దాదాపు 80 శాతానికి పైగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు .

అంతేకాక , ఈ రేడియో ఐసోటోప్లను జలశాస్త్రం , జీవశాస్త్రం , ఆరోగ్య సంరక్షణ , భౌతిక రసాయన శాస్త్రాలతో పాటు పరిశ్రమ , ఫుడ్ టెక్నాలజీ , వ్యవసాయంలో కూడా వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు . ఈ రేడియో ఐసోటోప్లను ఇంజెక్ట్ చేయడం ద్వారా భూగర్భంలో పెట్రోలియం పెపు లీకేజీని కూడా గుర్తించవచ్చన్నారు . ఈ సందర్భంగా సదస్యులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన సందర్భోచిత జనాబులిచ్చి ఆకట్టుకున్నారు . అంతకు మునుపు , ‘ న్యూక్లియర్ స్టెబిలిటీ , స్ట్రక్చర్ ‘ అనే అంశంపై బార్క్ రేడియోకెమిస్ట్రీ , అనలిటికల్ కెమిస్ట్రీ విభాగంలో పనిచేసిన డాక్టర్ ఏవీఆర్ రెడ్డి , ‘ సదార్థంతో రేడియేషన్ ఇంటరాక్షన్ ‘ అనే అంశంపై బార్క్ లోని రేడియోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ ధనదీప్ దత్తా ప్రసంగించారు . సోమవారం నాడు ఆరంభమైన ఈ కార్యశాల మరో మూడు రోజుల పాటు కొనసాగనుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *