ఆరోగ్య పరిరక్షణలో ఐవోటీది కీలక భూమిక

Telangana

_గీతం అధ్యాసక నికాస కార్యక్రమంలో ఐఐటీ హెదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ ఆచార్య

పటాన్‌చెరు,నవంబర్ 22 (మనవార్తలు )

ఆరోగ్య పరిరక్షణలో ఐనోటీ కీలక భూమిక పోషిస్తోందని బఐటీ హెదరాబాద్ లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ ఆచార్య అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఈతసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరు రోజుల ఆధ్యాపక వికాస కార్యక్రమంలో భాగంగా, గురువారం ఆయన ‘ఐనోటీ చిక్కులు: శక్తి, పనితీరు, కృత్రిమ మేథ’ అనే అంశంపై ఉపన్యసించారు. ఆరోగ్య సంరక్షణపై తన పరిశోధనా అనుభవం, భవిష్యత్తు పరిధి, ఈసీఈ విభాగం పరిశోధన చేపట్టే వీలున్న ఫ్లెక్సిబుల్ ఎకౌస్టిక్ ఎమిషన్ సెన్సార్ల గురించి ఆయన వివరించారు.ఆరోగ్య సంరక్షణలో నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి వీఎల్ఎస్ఐ, కృత్రిమమేథ, ఐవోటీల ఏకీకరణ గురించి డాక్టర్ అమిత్ నొక్కిచెప్పారు. ముఖ్యంగా కార్డియోపల్మోనరీ డిసీజ్, నిద్ర లేమిని అరికట్టడానికి తాము అల్గోరిథంను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ఇది శరీరంపెపలు సెన్సార్లను అమర్చే అవసరాన్ని తగ్గిస్తుందన్నారు. నిద్ర రుగ్మతలలో ఈసీజీ, హృదయ స్పందన రేటు, రక్తపోటు, ఉష్ణోగ్రత, శ్వాసక్రియ రేటు వంటి పారామితులను ఎక్కువ సెన్సార్లు లేకుండా పర్యవేక్షించే ప్రక్రియకు రూపకల్పన చేశామని చెప్పారు.భౌతిక, మానసిక, ప్రవర్తనా లోపాల ప్రభావం, సహజ విద్ర విధానాలకు భంగం కలిగించడంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పాత్రలను డాక్టర్ ఆచార్య వివరించారు. మెలటోనిన్ హార్మోన్, జీవసంబంధమైన విధులసి దాని ప్రభావం, సూర్యరశ్మి మానవ దేహంపై ఎక్కువసేపు పడడం వల్ల కలిగే దుష్ప్రభావాలను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు అడిగిన ప్రశ్నలకు తగిన విశ్లేషణాత్మక జనాబులిచ్చి ఆకట్టుకున్నారు.ఈఈసీత విభాగాధిపతి ప్రొఫెసర్ బి. మాధవితో కలిపి కార్యక్రమ సమన్వయకర్త ప్రొఫెసర్ కె. ముంజనాథాచారి అతిథిని సత్కరించారు. ఆ తరువాత, జేఎన్టీయూ హెదరాబాద్కు చెందిన డాక్టర్ రహీమ్ు ‘ఐవోటీ – సవాళ్లు, అవకాశాలపై ప్రసంగించారు. శనివారం వరకు కొనసాగనున్న ఈ ఎఫ్ఎపీలో పాల్గొంటున్న వారికి ఐనోటీ రంగంలో విలువైన జ్ఞానం, నెపుణ్యాలను అందిస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *