ఆరోగ్య సంరక్షణ, శక్తి నిర్వహణ, వ్యవసాయ ఆటోమేషన్, పర్యావరణ పర్యవేక్షణల నుంచి స్మార్ట్ నగరాల వరకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)ను ప్రతిచోటా వినియోగిస్తున్నట్లు ప్రజ్ఞ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీని దాట్ల చెప్పారు. గీతం పూర్వ విద్యార్థి (1991వ బ్యాచ్) కూడా అయిన ఆయన మంగళవారం ‘వివిధ అప్లికేషన్లలో ఐవోటీ నోడ్ల రూపకల్పన’ అనే అంశంపై ప్రసంగించారు.గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం రెండో రోజు ఆయన పాల్గొని, తన విస్తృత పరిశ్రమ అనుభవాన్ని సదస్యులతో పంచుకున్నారు. ఐవోటీ సర్వవ్యాప్తి అని, అధునాతన సాంకేతికతలను నడపడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో దాని ఆవశ్యకతను నొక్కిచెప్పారు. గోప్యత, భద్రత, నెతిక పరిగణనలపై పరస్పరం అనుసంధానించిన పరికరాల చిక్కులను అర్థం చేసుకోవడం ప్రాముఖ్యతను కూడా ఆయన ప్రస్తావించారు.దూరంగా ఉన్న రోగుల పర్యవేక్షణ, ఎక్కడో ఉన్న ఆస్తుల పర్యవేక్షణ, స్మార్ట్ ఫ్యాక్టరీలో ఐవోటీ వినియోగాలతో పాటు పారబాయిల్డ్ రెస్ట్ ఇండస్ట్రీలో ఐవోటీ వాడకం, సిమెన్స్ కర్మాగారం, నిర్ణయాలు తీసుకునే సాంకేతికత, చిరుతిళ్ల కర్మాగారంలో ఐవోటీ సాయంతో స్వయంప్రతిపత్తి నియంత్రణ వంటి ఉదాహరణలను ఆయన వివరించారు.ఈ అధ్యాపక వికాస కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు ఐవోటీ వినియోగంలో తలెత్తే సవాళ్లపై ప్రశ్నించి, మరింత లోతెన అవగాహనను ఏర్పరచుకున్నారు. ప్రొఫెసర్ పి.ఈశ్వర్‌తో కలిసి కార్యక్రమ సమన్వయకర్త ప్రొఫెసర్ కె.మంజునాథాచారి అతిథిని సత్కరించారు.కాగా, ‘సామాజిక ప్రయోజనం కోసం ఐవోటీ వినియోగం’ అనే అంశంపె డాక్టర్ అమిత్ అగర్వాల్, ‘బోరాన్ నెట్రెడ్ సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపె డాక్టర్ శంతను సాహా ప్రసంగించారు. ఈ ఎఫ్ఎపీ నవంబర్ 25 వరకు కొనసాగుతుందని, ఐవోటీ వినియోగంతో వీఎల్‌ఎస్‌ఐలో అవకాశాలు, సవాళ్ల గురించి సమగ్ర అవగాహనను అందిస్తుందని నిర్వాహకులు తెలియజేశారు.

ప్రతిచోటా ఐవోటీ: శ్రీని దాట్ల
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :