గీతమ్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘ససుధెస్ట్ కుటుంబానికి యోగా అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత, గీతం హెదరాబాద్ ప్రొ వెస్ట్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మరియు రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ప్రసంగంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. యోగా గురించి, రోజువారీ జీవితంలో యోగ సాధన చేయడం వలన కలిగే ప్రయోజనాలను వారు వివరించారు. ఆరోగ్యకరమైన శరీరం, మనస్సుల కోసం, అలాగే పనిలో ఒత్తిడిని తగ్గించడానికి నిత్యం యోగ సాధన ఎలా ఉపకరిస్తుందో వాళ్ళు విడమరిచి చెప్పారు. ఇతర ఔత్సాహిక సాధకులతో కలిసి వాళ్ళు యోగా సాధనలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో యోగ నిపుణుడైన బాల క్రిష్ణ, పాల్గొని యోగ సాధనను చేయించడంతో పాటు జీవితంలో యోగా శాస్త్రీయ ఔచిత్యం, ప్రాముఖ్యతలను సాధకులకు వివరించారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గీతం స్పోర్ట్స్, స్టూడెంట్ లెస్ట్ డెరైక్టరేట్ల సమన్వయంతో ఎపిసీసీ ఎన్ఎస్ఎస్ యూనిట్ల నిర్వహించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *