పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మార్చి 10, 11వ తేదీలలో నియోజకవర్గస్థాయి మహిళల క్రీడా పోటీలు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 12వ తేదీన పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నియోజకవర్గస్థాయి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించబోతున్నట్లు స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సోమవారం సాయంత్రం. పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మహిళ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్నమహిళా ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, మహిళా సంఘాల సభ్యులకు ఈ నెల 10, 11 తేదీలలో మైత్రి మైదానం వేదికగా వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు 12వ తేదీన బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.నియోజకవర్గ పరిధిలోని మహిళలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలాషించారు. ఈ సమావేశంలో ఎంఈఓ నాగేశ్వరరావు నాయక్, సుధాకర్, సుధాకర్, రాములు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఇందిరా క్రాంతి పథం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
