నేటి నుండి పటాన్చెరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలు

politics Telangana

_3, 4 తేదీలలో మైత్రి మైదానం, జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో క్రీడా పోటీలు

6వ తేదీన జిఎంఆర్ లో ముగింపు కార్యక్రమాలు

_ముఖ్య అతిథులుగా హాజరుకానున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, డిఐజి సుమతి

_ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మూడు రోజుల పాటు పటాన్చెరు పట్టణంలో మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సంవత్సరం మూడు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. 3వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు మైత్రి మైదానంలో క్రీడా పోటీలు ప్రారంభించినట్లు తెలిపారు.6వ తేదీ సోమవారం జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వేలాదిమంది మహిళలను భాగస్వామ్యం చేస్తూ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సమస్యలపై ప్రముఖులచే అవగాహన సదస్సులు, విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అన్య స్థాయిల మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న మహిళ ఉద్యోగినులు, విద్యార్థినిలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *