మధ్యవర్తిత్వంపై అంతర్జాతీయ సమావేశం…

politics Telangana

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ లా ఆధ్వర్యంలో ఈనెల 9-10 తేదీలలో ‘ నూతన సహస్రాబ్దిలో మధ్యవర్తిత్వం వివాదాలను పరిష్కరించే విధానం : ముందుకెళ్లే మార్గం ‘ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు . ఈ విషయాన్ని సదస్సు సమన్వయకర్త ఎన్.అప్పలరాజు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు . మధ్యవర్తిత్వం సమర్థంగా నిర్వహించడానికి తక్షణ చర్యలు అవసరమని , ప్రస్తుత సదస్సు ఆ దిశలో ఓ ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు . మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాల్గొన్న , ఆసక్తి ఉన్న వారి అభిప్రాయాలు , ఆలోచనలు , సూచనలను తెలుసుకోవడం లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు . భారత సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఈ సదస్సులో కీలకోపన్యాసం చేస్తారన్నారు . ప్రముఖ వక్తలు- ప్రొఫెసర్ ప్రాన్సిస్ లా , డాక్టర్ వాసిక్ అబాస్ దార్ , బ్రిటన్కు చెందిన ప్రొఫెసర్ బ్రయాన్ క్లార్క్ , జర్మనీకి చెందిన సమీర్ షా , ఆంధ్రప్రదేశ్ హెక్టార్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.యతిరాజులు , ప్రపంచ మేధో సంపత్తి సంస్థ మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎస్.రామారావు , సింగపూర్ లోని మధ్యవర్తి అజీజ్ తయాబాలి సామివాల్లా , అమెరికాకు చెందిన ప్రగ్యా శర్మ తదితరులు పాల్గొంటారని తెలియజేశారు . నీతి : మధ్యవర్తిత్వం , మధ్యవర్తిత్వం : మధ్యవర్తి పాత్ర , ట్రాన్స్ – నేషనల్ మధ్యవర్తిత్వ సమస్యలు వంటి పలు అంశాలపై విద్యార్థులు గోడపత్రికలు / పరిశోధనా పత్రాలు సమర్పించవచ్చన్నారు . విద్యావేత్తలు , న్యాయవాదులు , న్యాయాధికారులు , పరిశ్రమలోని వ్యక్తులు , విద్యార్థులు , పరిశోధక స్కాలర్లు ఈ రెండు రోజుల వర్చువల్ సదస్సులో పాల్గొనవచ్చని సమన్వయకర్త తెలియజేశారు . పేర్ల నమోదు , ఇతర వివరాల కోసం డాక్టర్ సీహెచ్ . లక్ష్మణరావు ( 99087 27688 ) లేదా ఎన్.ఏ.రాజు ( 79895 04959 ) ని సంప్రదించ్చన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *