పటాన్‌చెరులో 12 కోట్ల రూపాయలతో ఇండోర్ సబ్ స్టేషన్

politics Telangana

నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పెరుగుతున్న జనాభాకు అణుగుణంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాన్‌చెరు పట్టణంలో 12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33/11 కెవి ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో 12 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన 33/11 కెవి ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పటాన్చెరువు పట్టణంలో ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. పాశమైలారం నుండి నేరుగా నూతన సబ్ స్టేషన్ కి ప్రత్యేక లైను వేయడంతో పాటు పటాన్‌చెరున్చెరు, రామచంద్రాపురం పట్టణాలకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ లో 100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 132 కెవి సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు ఎంపీడీవో యాదగిరి, విద్యుత్ శాఖ ADE లు సంజీవ్, నాగరాజు, రవికాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నివర్తి దేవ్, అంతిరెడ్డి, అంజిరెడ్డి, గోపాల్ రెడ్డి, షకీల్, ఐలేష్, హమీద్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *