అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు _పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే మా లక్ష్యం

లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి

మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు:

పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలతో పాటు  గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ సొంతింటిని నిర్మించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా 3500 ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో రాజకీయాలకు అతీతంగా అర్హులకే వీటిని కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు.ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని దుర్వినియోగం చేయకుండా ఇళ్లను నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. ఇళ్ల నిర్మాణ దశకు అనుగుణంగా నిధులు విడుదల అవుతాయని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఇల్లు లేని కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయని.. ఇందుకు అనుగుణంగా ఇళ్ల కేటాయింపును పెంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుమలత, మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్, స్థానిక కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *