మనవార్తలు ,పటాన్ చెరు:
భారత్ అన్ని రంగాల్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని ముత్తంగి గ్రామంలో బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ ఏనిమిదేళ్ళ సేవ, సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమం నిర్వహించారు.ప్రధాని మోదీ చేస్తున్న సంక్షేమ పథకాలు , పాలనా సంస్కరణలు , కోవిద్ సమయంలో మోడీ వ్యవహరించిన తీరు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు .
కులమతాలకు అతీతంగా అన్నివర్గాలు కలిసిమెలసి ఉంటూ దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెబుతున్నారని ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ కొనియాడారు. వ్యాక్సిన్ తయారీకి అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రధాని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రధాని కృషితో అతిస్వల్ప కాలంలోనే దేశీయంగా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడమేకాకుండా ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలుగామన్నారు . శాస్త్ర, సాంకేతిక, విద్యా, వైద్య రంగాల్లో మనదేశం ప్రపంచంలోనే ముందువరుసలో ఉందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి జయశ్రీ, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ గడప గడపకు వెళ్లి కరపత్రాలను అందించారు. మోడీ ఎనిమిదేళ్ళ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఈశ్వరయ్య, ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి దేవెందర్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహెందర్, కార్యదర్శి బైండ్ల కుమార్, ఉపాధ్యక్షులు బాబు రాజు, నాయకులు వీరారెడ్డి, పుణ్యవతి, పుష్పా, సాయి, నరెందర్, షకీల్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.