మన వార్తలు,శేరిలింగంపల్లి :
రానున్న కొన్ని సంవత్సరాల్లో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ మిగతా దేశాలను శాసించే స్థాయికి చేరుకుంటుందని ఇస్రో విశ్రాంత శాస్త్ర వేత్త యెల్లా శివప్రసాద్ అన్నారు. బి.హెచ్.ఈ. ఎల్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి పిలుపు మేరకు ఆయన స్కూల్ ను సందర్షించి విద్యార్థులకు, ఉపాద్యాయులకు అంతరిక్ష పరిశోధన ల గురించి వివరించారు. అంతరిక్షంలో జరిగే పరిశోధనలు, రాకెట్ల తయారీ, వాటి ప్రయోగం, ఉపయోగం గురించి వివరించే విదంగా పుస్తకాల్లో పాఠ్యoశoగా చేర్చాలని ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. పిల్లల్లో చిన్నప్పటి నుండి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. రాకెట్ల తయారీ, ఉపగ్రహల ప్రయోగం గురించి వివరిస్తే వారు భవిశ్యథ్ లో దేశం గర్వించే గొప్ప శాస్త్ర వేత్తలుగా తయారవుతారని పేర్కొన్నారు. త్వరలోనే ప్రపంచంలో అబ్బురపరిచే విధంగా మన పరిశోధనలు ఉంటబోతున్నట్లు తెలిపారు.

సొంతంగా సొంతింటి కల….
త్వరలోనే అంతరిక్షంలో సొంతంగా సొంతింటి కల నెరవేరనుందని, అందుకు భారతీయ శాస్త్ర వేత్తలు తీవ్ర కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ప్రయోగించిన అనేక ఉపగ్రహల్లోనూ, రాకెట్ల లలోను తన సేవాలున్నాయని, ఇపుడు పిల్లల్లో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని నింపేందుకు ఉచితంగా తన అనుభవాలను పంచుకొంటూ వారిలో ఆసక్తిని నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన జ్యోతి విద్యాలయ హై స్కూల్ ఫాదర్ అండ్రూస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
