కిలోమీటర్ కమిషన్ పెంచండి

politics Telangana

– ఓలో, ఉబర్ సంస్థలకు, ప్రభుత్వానికి క్యాబ్ డ్రైవర్ల విజ్ఞప్తి

– కమిషన్ పెంచాలంటూ క్యాబ్ యజమానులు, డ్రైవర్ల ధర్నా

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఓలో, ఉబర్ క్యాబ్ సంస్థలు కారు క్యాబ్ లకు కిలోమీటర్ రేట్ పెంచాలని పటాన్ చెరు కేంద్రంగా పనిచేస్తున్న క్యాబ్ యజమానులు, డ్రైవర్లు వాటి సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. శుక్రవారం పటాన్ చెరు మండల పరిషత్ ఆవరణలో ఓలో, ఉబర్ క్యాబ్ సంస్థలు కిలోమీటర్ చొప్పున రేటు పెంచాలని డిమాండ్ చేస్తూ 30 మందికి పైగా క్యాబ్ యజమానులు, డ్రైవర్లు ధర్నా చేపట్టి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓలో, ఉబర్ క్యాబ్ సంస్థలు క్యాబ్ లతో రోజువారీగా కమిషన్ బేసిక్ తో నడుపుతున్నామని అన్నారు. ఈ రెండు సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల కిలోమీటర్ కు 13, 14 రూపాయలు చెల్లిస్తుందని, అదేవిధంగా సిటీ బయటకు వాహనాలు వెళితే కిలోమీటర్ కు 9 రూపాయలు చెల్లిస్తుందని చెప్పారు. అలాగే సిటీ చుట్టుపక్కల నుండి ఎయిర్పోర్ట్ కు క్యాబ్ వెళితే కేవలం 600 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని అన్నారు. రోజువారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో పోలిస్తే క్యాబ్ సంస్థలు కిలోమీటర్ కు మాకు చెల్లిస్తున్న కమిషన్ సరిపోవటం లేదని, నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాబ్ సంస్థలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాబ్ లకు కిలోమీటర్ చొప్పున 30 రూపాయలకు పైగా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. క్యాబ్ ల కమిషన్ తక్కువ రావడంతో పెరిగిన నిత్యవసరాలతో ఎంతగానో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని క్యాబ్ సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాబ్ యజమానులు, డ్రైవర్లు గౌతం, ప్రసాద్, రాందాస్, నాయుడు, రాజు, కృష్ణ, సయ్యద్, బబ్లు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *